Rayadurgam Water Problem : విన్నారుగా వీరి ఆవేదన. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నీటి కష్టాలు ఇలా ఉన్నాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు హెచ్ఎల్సీ కాలువ నుంచి కనేకల్‌లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించారు. ప్రజల అవసరాలను ముందే గుర్తించిన ప్రభుత్వం 3100 మెగాలీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును ఇప్పటికే పూర్తిగా నింపింది. అయితే నిల్వ చేసిన నీటిని వారికి అందించడం కూడా అధికారులకు చేత కావడం లేదు. దాహం దాహం అంటూ జనం గగ్గోలు పెడుతున్నా వారి కేకలు వినపడనట్లు మొద్దునిద్ర నటిస్తున్నారు.
Comments
Comments are disabled for this post.